పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం రాజ్ కుమార్ రెడ్డి
అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సుల అందజేత నారాయణపేట డిసెంబర్14 (నేటిదర్శిని):పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలో అథ్లెటిక్ క్రీడాకారులకు రూ.35 వేల విలువగల డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న విద్యార్థులను, పేదరికంతో క్రీడారంగంలో వెనుకబడి ఉన్న క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులతో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్...