అల్లు అర్జున్‌ అరెస్ట్.. నేరం రుజువైతే ఎన్నేళ్ల జైలు శిక్ష పడొచ్చు?

సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు డిసెంబరు 4 రాత్రి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ మీడియాకు చెప్పారు. అల్లు అర్జున్‌పై ప్రధానంగా రెండు సెక్షన్ల కింద కేసులు పెట్టారు చిక్కడపల్లి పోలీసులు. రేవతి భర్త భాస్కర్...