పెళ్లి పీటలు ఎక్కిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్
సినిమా డెస్క్, నేటిదర్శిని:తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించిన నటి కీర్తి సురేష్ వివాహం ఘనంగా జరిగింది. గోవాలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కీర్తి సురేష్ ప్రేమించిన వ్యక్తి ఆంటోనీ, ఆమె మెడలో తాళి కట్టి జీవిత భాగస్వామిగా మారారు.గోవాలోని ప్రత్యేకంగా డిజైన్ చేసిన రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. సంప్రదాయ విధానంలో నిర్వహించిన ఈ వేడుకలో కీర్తి పట్టు చీరలో, ఆంటోనీ క్లాసిక్ డిజైనర్ డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు....