Newspaper Banner
Date of Publish : 07 December 2024, 7:04 pm Digital Edition : Unknown Author

Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం.. విగ్రహాం ఫోటో చూసారా..?

॥ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం

॥ ఈనెల 9న విగ్రహావిష్కరణ

॥ సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

॥ ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం

న్యూస్ డెస్క్, నేటి దర్శిని: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం విగ్రహం ఆవిష్కరించే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.

ఆయనతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఫౌంటైన్ నిర్మాణ పనులపై వివరణలు తీసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో ఆగస్టు 8న భూమిపూజ జరిగింది. విగ్రహం చుట్టూ అదనపు అలంకరణలు కూడా ప్రభుత్వం చేయబోతోంది. రాత్రి సమయానికి లేజర్ లైట్లు, పెద్ద ఫౌంటెయిన్ నిర్మించబడుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్పై కూడా సందర్శకులు ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంది. విగ్రహం రూపు తెలంగాణతనం, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.