HomeతెలంగాణEarthquakes: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquakes: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

📰 Generate e-Paper Clip

బయకంపితులై ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు

భూకంపం జరక్ తో ఉక్కిరి బిక్కి రైన ఉభయ ప్రాంతాల ప్రజలు

న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఊహించని విధంగా భూకంపం ప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, ప్రాంతాల్లో పలు సెకన్ల పాటు స్వల్ప భూమి కంపన సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని  ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించి ప్రకంపనలు సృష్టించింది.
ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపిం చింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల వ్యాప్తంగా భూకంపం వచ్చింది.
కొన్ని చోట్ల నిమిషం పాటు స్పల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించింది. బువారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.
అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూ కంపం దెబ్బకు కుర్చీలో కూర్చున ప్రజలు సైతం కిందపడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్‌ విద్యానగర్‌లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు చోట్ల భూ ప్రకంపనలతో భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు.


వరంగల్ లో స్వల్ప భూకంపం…వరంగల్ లోని పలు ప్రాంతాల్లో 5నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా భూమి కంపిం చిoది. ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో భూకంపం సంభవించింది. ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిది. ఇంట్లో ఉన్న సామాన్లు బీరువాలు బిల్డింగులు ఊగడం భూమి ఊగినట్టుగా ఆనవాళ్లతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనతో అప్రమత్తమయ్యారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని సెకన్ల పాటు ఇంట్లో వస్తువుల కదలిక రావడంతో ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడ్డారు. ఇక భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంలో సిసి కెమెరాలో భూకంపం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular