Newspaper Banner
Date of Publish : 18 November 2024, 9:28 am Digital Edition : Unknown Author

AK Foundation: గవర్నమెంట్ ప్లీడర్లని సన్మానించిన కట్టెబోయిన అనిల్ కుమార్

మిర్యాలగూడ కోర్టులో నూతనంగా నియమింపబడిన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గోదల వెంకటరెడ్డి మరియు స్పెషల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ల్యాండ్ అక్వి్సేషన్ ) మట్టపల్లి శ్రీధర్ గౌడ్ లను ఆదివారం వారి లా కార్యాలయంలో హైకోర్టు న్యాయవాది, ఏ కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి అనేది చాలా ఉన్నతమైన వృత్తి అని దాని ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా సేవ చేయవచ్చని ప్రభుత్వం తరుపున అన్ని వర్గాల వారికి వీరి సేవలు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని నూతన న్యాయవాదులను కోరారు.
ఈ కార్యక్రమంలో  బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు కొర్రపిడత సురేష్ యాదవ్,బీసీ సంఘం టౌన్ అధ్యక్షులు చిలుకల మురళి యాదవ్,మన్నెం కోటి తదితరులు పాల్గొన్నారు.