Newspaper Banner
Date of Publish : 16 November 2024, 12:48 pm Digital Edition : Unknown Author

తెలంగాణ పోలీస్ బ్యాడ్జీల్లో మార్పులు

తెలంగాణ పోలీస్ శాఖ బ్యాడ్జీల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

బ్యాడ్జీల్లో ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న “తెలంగాణ స్టేట్ పోలీస్” (TSP) స్థానంలో “తెలంగాణ పోలీస్” (TGP), అలాగే “తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్” (TSSP) స్థానంలో “తెలంగాణ జి.స్పెషల్ పోలీస్” (TGSP) గా మారుస్తున్నారు. అదే విధంగా, “తెలంగాణ స్టేట్ ప్రోటోకాల్ సర్వీస్” (TSPS) స్థానంలో “తెలంగాణ జి.ప్రోటోకాల్ సర్వీస్” (TGPS) గా మార్పు చేయాలని ఆదేశించారు.

ఈ మార్పులతో పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కొత్త బ్యాడ్జిలు అమలులోకి రావడానికి సంబంధిత శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.